CBI: వారి చెప్పు చేతుల్లో సీబీఐ, ఈడీ : మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ తో పాటు నెహ్రూ కుటుంబానికి సంబంధించిన అనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కుట్రలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ గరీబీ హటావో నినాదంతో సీలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చి భూస్వాముల చెర నుంచి భూములను విడిపించి లక్షలాది ఎకరాలను సామాన్యులకు పంచిన ఘనత ఇందిరాగాంధీదే అన్నారు. ఈడీ, సీబీఐ (CBI), ఎలక్షన్ కమిషన్లను తమ చెప్పు చేతులో ఉంచుకొని, రాష్ట్రాల్లో ఓటు చోరీతో బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ఇటీవల బిహార్ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు.






