మ్యాజిక్ బ్రిక్స్ వ్యాపారకార్యకలాపాల విస్తరణ

రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు ఉన్న మ్యాజిక్ బ్రిక్స్ తమ వ్యాపార కార్యకలాపాలను దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరింపజేయాలని నిర్ణయించింది. రానున్న మూడు నెలల్లో భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పుణె, ఢిల్లీ, ముంబై నగరాల్లో కార్యాలయాలు నెలకొల్పి అన్ని వర్గాల ప్రజలకు సిర్థాస్తిని అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ సంకల్పమని సంస్థ సీఈవో సుధీర్ పాయ్ తెలిపారు. గత పన్నెండూ నెలల్లో ప్రాపర్టీ కొనుగోలుదారులు 50 శాతం పెరగడంతో వినియోగదారులతో పాటు ఇన్వెస్టర్లకు కూడా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ నగరం ఒక ఏడాది కాలంలోనే దేశంలోనే అత్యుత్తమ రియల్ ఎస్టేట్ గమ్యంగా మారిందన్నారు. ఇక్కడి మార్కెట్ మ్యాజిక్ బ్రిక్స్ వినియోగదారుల సెర్చ్ ధోరణికి సంబంధించి తాజా నివేదికను విడుదల చేశారు. ఇంటి కొనుగోలు ప్రక్రియ కాలం 4.1 నెలల నుంచి 7.5 నెలలు పెరిగిన కారణంగా, ఇదే కాలానికి గాను ఇప్పటికే ప్రాపర్టీ కొనుగోలుదారుల సంఖ్య కూడా గణనీయంగా 14,900 నుంచి 26,800లకు పెరిగింది. 2016, జులైలో 5,700 నుంచి ఈ సంవత్సరం జూన్ నాటికి 7,200లకు చేరింది.ప్రీమియం విభాగం కూడా నామమాత్రంగా 2,800 నుంచి 3,700లకు పెరిగిందని సుధీర్ పాయ్ తెలిపారు. రెంటల్ విభాగంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2016 జులైలో 32,500 ఉన్న వినియోగదారుల సంఖ్య 2017, జూన్ నాటికి 42,600లకు చేరింది. కమర్షియల్ విభాగంలో కూడా వినియోగదారుల సంఖ్య ప్రతి నెల 3,100 నుంచి 3,900లకు పెరిగింది. 2016లో 1,600లుగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ విభాగం కూడా చెప్పుకోదగ్గ పెరుగుదలతో 2, 600లకు చేరింది.