Lungs: ప్రపంచంలోనే మొదటిసారి ..12 ఏళ్ల బాలుడికి
పొరపాటున కలుపు మందు తాగిన బాలుడికి అత్యంత అరుదైన లోబార్ పద్ధతిలో విజయవంతంగా ఊపిరితిత్తుల (Lungs) మార్పిడి చేసినట్లు యశోద హాస్పిటల్ (Yashoda Hospital) వైద్యులు తెలిపారు. వైద్యులు డా.సురేశ్ పానుగంటి, డా. ప్రశాంత్ రెడ్డి, డా.విశ్వేర్వరన్ బాలసుబ్రమణియన్, డా.చేతన్రావు, డా.పంక్తి శేర్ తదితరులు ఆసుపత్రిలో మీడియాకు వివరాలు వెల్లడిరచారు. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఓదెల గ్రామానికి చెందిన రైతు సతీశ్‌కుమార్, సుమతల దంపతుల 12 ఏళ్ల కుమారుడు అనురాగ్ సందీప్ (Anurag Sandeep) మార్చి 15న పొరపాటున కలుపు మందు తాగాడు. దీంతో ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సహా బహుళ అవయవాలు పనిచేయడం మానేశాయి. క్రిటికల్ కేర్ వైద్య బృందం పర్యవేక్షణలో జీవన్‌దాన్ చొరవతో బ్రెయిన్‌డెడ్ అయిన రోగి నుంచి సేకరించిన ఊపిరితిత్తులను బాలుడికి ట్రాన్స్‌ప్లాంట్ చేశాం. కోలుకోవటంతో తాజాగా డిశ్చార్జ్ చేశాం అని వైద్యులు వివరించారు. ఈ సమావేశంలో డా.రమ్యారెడ్డి, బా.కేర్ బాలసుమ్రణియన్, మంజునాథ్ పాల్గొన్నారు.






