భాగ్యనగరంలో 2 వందల కోట్ల డాలర్ల ఐటీ ప్రాజెక్టు!

హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాదే కాదు.. ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ పార్కు నిర్మాణానికి తెలంగాణకు చెందిన మైహోమ్ గ్రూపు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 2 వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. కోకాపేట వద్ద 30-35 లక్షల చదరపు అడుగుల మేర ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుందని సమాచారం. దీనిలో సెజ్, అలాగే సెజ్ కాని భూములు కూడా ఉన్నాయని మైహోమ్ కన్‌స్ట్రక్షన్ ప్రై లిమిటెడ్ సీఎఫ్‌ఓ ఎ. శ్రీనివాసరావు తెలిపారు. మరో 8-10 సంవత్సరాల్లో 80 ఎకరాల మేర ప్రాజెక్టును పూర్తిచేయాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. గురుగ్రామ్ సమీపంలో డీఎల్ఎఫ్ ప్రారంభించిన సైబర్ హబ్ వలె ఈ నిర్మాణాలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం సింగపూర్, హాంగ్ కాంగ్, సౌత్‌కొరియా తదితర దేశాలకు చెందిన ఆర్కిటెక్టుల సాయంతో ఈ నిర్మాణాలు జరుగుతాయట. ప్రాథమిక దశలో 60-63 ఎకరాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు శ్రీనివాసరావు వివరించారు.