KTR : కొడంగల్‌లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తోంది : కేటీఆర్

తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్‌లో బీఆర్‌ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ (KTR)మాట్లాడారు. కొడంగల్(Kodangal) లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదు. అనుముల(Anumula) అన్నదమ్ములు, అదానీ(Adani) ల కోసమే పనిచేస్తున్నారు. రూ.కోట్లు దోచిపెట్టేందుకే పనిచేస్తున్నారు. మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారు. కానీ రేవంత్ ప్రజల కోసం పనిచేయడం లేదు. భూములు గుంజుకోవాలనేదే ఆలోచన. రైతు బంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు.