ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే.. వదిలిపెట్టేది లేదు

మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, సంబంధంలేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏ మాత్రం సంబంధం లేకపోయినా, పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్ఠతకు భంగం కలిగేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముగ్గురు నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా కేటీఆర్ మరో మారు నోటీసులు పంపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.