KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా : కేటీఆర్

వచ్చే ఏడాది తాను పాదయాత్ర (Padayatra) చేయనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ (BRS)ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, డిసెంబర్ (December) వరకు పార్టీ బలోపేత కార్యక్రమాల్లో ఉంటానని చెప్పారు. బీఆర్‌ఎస్ కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.