KTR: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు (RS Praveen Kumar) ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి తరఫున పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్బంధించడం రేవంత్ (CM Revanth Reddy) ప్రభుత్వ గూండాగిరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులపై కర్కశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ పతనం త్వరలోనే ఉంటుందని కేటీఆర్ (KTR) మండిపడ్డారు.