KTR: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎష్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. మే 15 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. “పర్యావరణాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారు” అని కేటీఆర్ (KTR) ఆరోపించారు.