KTR: వారికి తాము అండగా ఉంటాం : కేటీఆర్
సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్మెట్లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అడిక్మెట్, రాంనగర్ (Ramnagar), విద్యానగర్ (Vidyanagar) ప్రాంతాల్లో పర్యటించారు. 18 మంది మృతి చెందిన కుటుంబంతో పాటు, ఇతర బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి తాము అండగా ఉంటామన్నారు. ఇప్పటికే కొందరు తమ పార్టీ నాయకులు జెడ్డా (Jeddah) వెళ్లారని తెలిపారు. భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని తెలిపారు. ఇంత పెద్ద దు:ఖం మారెవరికీ రాకూడదన్నారు. ప్రమాద ఘటన తనతోపాటు అందరికీ బాధ కలిగించిందన్నారు. శోక సమయంలో బాధిత కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.






