మైక్రోచిప్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ కోకాపేటలో మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడోవంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే సృష్టించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని అన్నారు. పారిశ్రామికవ్తేలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తున్నదని తెలిపారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికి లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని వెల్లడించారు. బెంగళూరు, చెన్నై, కంటే హైదరాబాద్ ముందంజలో ఉంది. భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్‌క్వార్టర్స్, ప్రపంచంలోనే హైదరాబాద్ అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అని అన్నారు.






