కేటీఆర్ కు అరుదైన గుర్తింపు.. ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు ఆహ్వానం..

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గుర్తింపు లభించింది. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ స్థాపించింది చంద్రబాబు అయితే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని వృద్ధి చేయడంలో ఎంతో పాటుపడింది కేటీఆర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అలాంటి కేటీఆర్ మేధా సంపత్తుకి ముద్దులై అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపించారు. ఈ సదస్సు ఏప్రిల్ 13న అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇందులో భారత పారిశ్రామిక రంగంలో కొత్తగా కల్పించగలిగే అవకాశాలు, ఎదుర్కొనే సవాళ్లు అంశంపై జరిగే చర్చలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ కు ఆహ్వానం అందింది. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు తెలంగాణ భవిష్యత్తుకి దిశా నిర్దేశాన్ని చేయడంలో కేటీఆర్ తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేటీఆర్ కు ఇటువంటి అరుదైన గుర్తింపు దక్కడం అతని మేధా సంపత్తుకి నిర్వచనం గా అందరూ భావిస్తున్నారు.