KTR : సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు : కేటీఆర్

యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan )కు నివేదించినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. ఆయన ఢల్లీిలో మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్ (Governor) కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. యూజీసీ (UGC) నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలతో నివేదిక ఇచ్చాం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించాం. మరోవైపు ఎన్‌హెచ్-365బి రహదారిని పొడిగించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరాం అని కేటీఆర్ తెలిపారు.