KTR: కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్ లా గవర్నర్ ప్రసంగం : కేటీఆర్

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ (Gandhi Bhavan)లో కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్‌లా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్(Governor) తో పచ్చి అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతారనుకున్నాం. రైతులకు భరోసా ఇస్తారని భావించాం. 20 నుంచి 30 శాతానికి మించి రైతులకు రుణమాఫీ జరగలేదు. కానీ పూర్తిగా చేసినట్లు గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు. ఈ ప్రసంగంతో ఆయన స్థాయిని తగ్గించారు. సీఎం రేవంత్ (CM Revanth) చేతకానితనం వల్ల అనేక ఎకరాలకు నీరు అందడం లేదు. 20 శాతం కమీషన్ తప్ప, విజన్ లేని ప్రభుత్వమిది. సాగునీటి సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ చేసిన అప్పుల గురించి ప్రస్తావన లేదు. ఢిల్లీ (Delhi) కి మూటలు పంపేందుకు ఈ ప్రభుత్వం ఉంది అని విమర్శించారు.