KTR: కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారు: కేటీఆర్

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయారని, ఇప్పుడు వాళ్లంతా బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని రైతులు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవాల సన్నాహక సభలో మాట్లాడిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్.. పాలనలో దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయతో కాంగ్రెస్ దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని, ప్రజలు త్వరలోనే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారని కేటీఆర్ (KTR) హెచ్చరించారు.