KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించండి.. కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్

కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, మళ్లీ ప్రజల తీర్పు కోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ చేశారు. లోక్‌భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ను ఉద్దేశించి, కేటీఆర్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి, వారి సీట్లపై మళ్లీ ఎన్నికలు జరిపించాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల గురించి గొడవ చెయ్యడం, పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా రాజ్యాంగ సవరణ చేస్తామని ప్రచారం చేయడం మానేస్తే మంచిది. ఎందుకంటే, ఈ ప్రచారం వారి నైతికతను ప్రశ్నిస్తుంది,” అని కేటీఆర్ (KTR) అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించి, నిజాయితీగా ప్రవర్తించాలని సూచించారు.
పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ మారి, బీజేపీలో చేరిన నేపథ్యంలో.. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా పలువురు కాంగ్రెస్ నేతలు చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటించేలా రాజకీయ సవరణ చేయాలని, తాము అధికారంలోకి వస్తే దీనికోసం రాజకీయ సవరణ చేస్తామని అన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీ మారి, కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై అప్పట్నుంచే బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న విధానాన్నే.. రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్నారని మండిపడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నైతిక బాధ్యతతో ప్రవర్తించాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు.