KRMB :ఏపీ విజ్ఞప్తి.. కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం వాయిదా

కృష్ణానదీ యాజమాన్య బోర్డు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ఈ నెల 24కు వాయిదా పడిరది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి రెండు రాష్ట్రాలకు నీటి వాటాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇవాళ కేఆర్‌ఎంబీ (KRMB) ప్రత్యేక సమావేశానికి ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి, తెలంగాణ (Telangana) నీటిపారుదల ముఖ్య కార్యదర్శితో కృష్ణాబోర్డు చైర్మన్ అతుల్ జైన్ (Atul Jain )మధ్యాహ్నం సమావేశం కావాల్సి ఉంది. అయితే తనకు ముందుగానే నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందువల్ల ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ స్పెషల్ సీఎస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రత్యేక సమావేశాన్ని కేఆర్‌ఎంబీ సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్ జలసౌధ (Jala soudha)లో సమావేశం జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం పంపించింది.