Konda Surekha: నాగార్జున కుటుంబంపై నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా
ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు. నాగార్జున (Nagarjuna) , ఆయన కుటుంబాన్ని (Family) బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బందిపెట్టాలని కాని, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కాని నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని పేర్కొన్నారు.







