Komatireddy :ఆయన అసెంబ్లీ వస్తారా?.. ఆ పదవిని వారికి అప్పగిస్తారా?

తాను నీతి, నిజాయతీకి మారుపేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు తన గురించి విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేసు, ధరణి వంటి పలు కేసులున్నాయని విమర్శించారు. తనపై ఒక్క కేసు లేదని, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మూడేళ్లు మంత్రి (Minister) పదవి వదులుకున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆ పదవిని కేటీఆర్ లేదా హరీశ్‌రావు తీసుకోవాలన్నారు. అప్పుడే మాత్రమే వారికి సమాధానం చెబుతామన్నారు.
కేటీఆర్ ఓ ఎమ్మెల్యే మాత్రమే. అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ లీడర్ కాదు. వాళ్ల నాన్న పేరు చెప్పి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మూసీ ప్రక్షాళన అప్పుడు చేయలేదు. ఇప్పుడు మేం చేస్తే అడ్డుకుంటున్నారు. యమునా నది కంటే మూసీ డేంజర్‌లో ఉంది. ఢల్లీిలో తమ ప్రభుత్వం రాగానే యమునా నదిని ప్రక్షాళన చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఇక్కడ మాత్రం మూసీని ప్రక్షాళన చేస్తామంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) అడ్డుకుంటున్నారు. మూసీ కాలువ వెంట ఏసీ పెట్టుకుని గదుల్లో నిద్రపోయారు. కేంద్రంలో యమున గంగ, సబర్మతి ప్రక్షాళన చేస్తామంటారు. మేం మాత్రం మూసీని ప్రక్షాళన చేయొద్దా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలకు మూసీపై అవగాహన లేదు. కేటీఆర్, హరీశ్‌రావు దగ్గర దోచుకున్న సొమ్ము ఉంది. వాళ్లు కాకుండా కేసీఆర్ ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతా? 30 మంది సభ్యులు ఉండి మీరు అసెంబ్లీకి రావడం లేదు. ఆయన వస్తారా? లేదంటే రాజీనామా చేసి ప్రతిపక్ష నేత పదవిని కేటీఆర్, హరీశ్‌రావుకు అప్పగిస్తారా? బీఆర్‌ఎస్ సగం దుకాణం మూతపడిరది. పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన 16 స్థానాల్లో గుండు సున్నా రాగా, ఏడిరటిలో డిపాజిట్ పోయింది అని విమర్శించారు.