Rajagopal Reddy : ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? : రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి (Minister) పదవి ఇస్తామని మాటిచ్చారు. ఇచ్చినప్పుడు ఇవ్వండి. ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? లోక్సభ (Lok Sabha) ఎన్నికల్లో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం (Khammam) జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. 11 మంది గెలిచిన నల్గొండ (Nalgonda) జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా? అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నా? అని అన్నారు.







