Komatireddy : ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు : మంత్రి కోమటిరెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హ్యామ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్లు కేటాయించామని, త్వరలో టెండర్లు (Tenders) ఆహ్వానిస్తామన్నారు. రూ.60,799 కోట్లతో రోడ్లు నిర్మాంచాలని నిర్ణయం తీసుకున్నట్లు, ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు (Record) అని పేర్కొన్నారు. రూ.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లకు విస్తరణ చేయన్నుట్లు తెలిపారు. రూ.30 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.







