Mahesh Kumar Goud: అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనారిటీలకు మేలు: మహేష్ కుమార్ గౌడ్
 
                                    కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌పై ఎలాంటి కేసులు ఉన్నాయి? అవి ఏమయ్యాయో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమాధానం చెప్పాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత కెప్టెన్‌గా అజారుద్దీన్ (Azharuddin) ఎన్నో విజయాలు అందించిన విషయం కిషన్ రెడ్డి మరిచిపోయారా? అని మండిపడ్డారు. ఎంపీగా కూడా అజారుద్దీన్ ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై బీజేపీ (BJP) నేతలు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అజారుద్దీన్ సుదీర్ఘ కాలం దేశానికి సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనారిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. మంత్రి పదవి గురించి మూడు నెలల ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.











 
                                                     
                                                        