Kishan Reddy : తెలంగాణలోనూ మా పార్టీ అధికారంలోకి : కిషన్ రెడ్డి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయాన్ని ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ (BJP)కి మంచి వాతావరణం ఉంది. కర్ణాటక(Karnataka), తెలంగాణ (Telangana) లోనూ మా పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్‌ఎస్(BRS) తరహాలోనే కాంగ్రెస్ (Congress )ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. బీసీలను అవమానిస్తూ, అన్యాయం చేస్తున్నారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అని అన్నారు.