Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డిది ఫెయిల్యూర్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు మాట్లాడరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హామీల అమలులో రేవంత్ వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు నాపై, బీజేపీ (BJP)పై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయని తప్పుడు ప్రచారం చేశారు. గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇలానే చేశారు. నాపై వ్యక్తిగత విమర్శలకు దిగినా నేను భయపడను. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఆ రెండు పార్టీల మాదిరి బీజేపీ అవినీతి, కుటుంబ పార్టీ కాదు. ఇచ్చిన హామలు అమలు చేయడమే బీజేపీకి తెలుసు. మా పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు. ఫేక్ వీడియోలతో మా పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిపైనా నా వివరణ వినే ధైర్యం కేసీఆర్ (KCR), రేవంత్ రెడ్డికి ఉందా? కాంగ్రెస్ హైకమాండ్‌కు భయపడి రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేరు. సీఎం రేవంత్ రెడ్డిది ఫెయిల్యూర్ ప్రభుత్వం అని మండిపడ్డారు.







