Kishan Reddy :వాటిని పక్కన పెట్టి బీజేపీ పై ఆరోపణలు : కిషన్ రెడ్డి

అబద్ధాలు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy )ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఒక విధానం ఉంటుంది. తెలంగాణలో కేంద్రం చేపట్టిన రూ.10 లక్షల కోట్ల విలువైన పనులను ఇప్పటికే వివరించాం. నేను ఇతర కేంద్ర మంత్రులను బెదిరించానని దిగజారుడు మాటలు మాట్లాడారు. కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేయాలని సీఎంలకు ఎన్నో లేఖలు రాశాను. సీఎంలతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తిని. దేశంలో నిర్మించే 7 టెక్స్‌టైల్ పార్కు (Textile Park ) ల్లో ఒకటి తెలంగాణకు తెచ్చాను. రాష్ట్రానికి ఆర్‌ఆర్‌ఆర్ (RRR)ను కేంద్రం మంజూరు చేసింది. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. వాటిని పక్కన పెట్టి బీజేపీఐ ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శించారు.