KCR: అసెంబ్లీకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) అసెంబ్లీ వద్దకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన చేరుకున్నారు. శాసనసభ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs) కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వారితో ఆయన సమవేశమయ్యారు. అసెంబ్లీ (Assembly)లో బీఆర్‌ఎస్ (BRS) అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.