KCR : బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై కేసీఆర్ సమావేశం!

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (Chandrasekhar Rao) ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ (Medak) , నిజామాబాద్ (Nizamabad) జిల్లాల ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ (BRS) రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని, మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాటు చూసుకోవాలని నేతలకు సూచించారు.