BRS : బీఆర్ఎస్ విప్‌ల నియామకం

తెలంగాణ శాసనమండలి, శాసనసభలో బీఆర్‌ఎస్ (BRS) విప్‌లను ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నియమించారు. మండలి విప్ గా ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ (Satyavati Rathod), శాసనసభ విప్ గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(KP Vivekananda Gowda )ను బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) పక్షాన ఎంపిక చేసినట్టు కేసీఆర్ శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar )ను కలిసి లేఖను అందజేశారు.