MLC Kavitha: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టసవరణపై కవిత కీలక వ్యాఖ్యలు

2018 పంచాయతీరాజ్ చట్ట సవరణపై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) గట్టిగా సమర్థించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. “2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు బిల్లులు ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు వేర్వేరు బిల్లుల గురించి చెప్పకుండా, ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తోంది” అని పేర్కొన్నారు. తాను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు మద్దతు ఇచ్చానని కవిత (MLC Kavitha) తెలిపారు. “నాలుగు రోజుల తర్వాత బీఆర్ఎస్ వాళ్లు కూడా నా దారిలోకి రావాల్సిందే” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ చట్ట సవరణపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా బలపరుస్తున్నట్లు కవిత పునరుద్ఘాటించారు. తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, బీఆర్ఎస్ పార్టీ వాటిపై స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత (MLC Kavitha) బదులిచ్చారు.