Kavitha: వాటిని పరిష్కరించేలా సీఎం రేవంత్రెడ్డి పై పోరాటం : కవిత
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా (Khammam District) లోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వంపై తాను పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై, ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తోందని కవిత పేర్కొన్నారు.






