Karimnagar Mayor :ప్రతి కుంభకోణం వెనుక ఆయన పాత్ర ఉంది : కరీనంనగర్ మేయర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు (Sunil Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో బీజేపీలో చేరిన అనంతరం సునీల్ రావు మాట్లాడారు. టీడీపీ (TDP) నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ గంగుల కమలాకర్ (Gangula Kamalakar )ఆర్థిక పరిస్థితి ఏంటి? టెండర్ల తర్వాత కమీషన్లు ముడితే చాలు, ఆ తర్వాత గంగుల కనిపించరు. ఆ పనుల గురించి అసలు పట్టించుకోరు. కరీంనగర్‌లో జరిగిన ప్రతి కుంభకోణం వెనక ఆయన పాత్ర ఉంది. బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ నగర అభివృద్ధి జరిగిందన్నారు.
కరీంనగర్ అభివృద్ధిని గంగుల కమలాకర్ ఏనాడూ పట్టించుకోలేదు. డ్రైనేజీ నీళ్లు మళ్లించకుండా మానేరు రివర్ ఫ్రంట్ పేరిట నిధులు వృథా చేశారు. నగర అభివృద్ధి ఆగిపోవద్దని నేను ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నా. చెక్‌డ్యామ్‌లు ఎందుకు కొట్టుకుపోయాయి? చెక్‌డ్యామ్‌లు, రోడ్ల కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే. నాకు మేయర్ పదవి రాకుండా ఆనాడే అడ్డుపడ్డారు. కేవలం కేంద్ర నిధులతోనే నగర అభివృద్ధి జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తాం. మరికొంత మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారు అని తెలిపారు.