తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. జస్టిస్ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన విషయం విదితమే.