Justice AK Singh: హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ (Justice AK Singh) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క పాటు పలువురు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, నగర ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.