SLBC : లోపల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో… వారికి తెలియదు

ఎస్‌ఎల్‌బీసీ (SLBC) సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లో లభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. టన్నెల్ (Tunnel) లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కన్పించిన చోట తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిపారు.
5-8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురి ఆనవాళ్లు ఉన్నట్లు స్కానింగ్ (Scanning) లో కన్పించాయి. మరో నలుగురు సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో మొత్తం 11 విభాగాల వాళ్లు పనిచేస్తున్నారు. పనులు వేగంగా జరగటం లేదని విమర్శిస్తున్నారు. లోపల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వారికి తెలియట్లేదు. విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. కాళేశ్వరంలో 200 కిలోమీటర్ల సొరంగం తవ్వామని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మరి పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీలో 20 కిలోమీటర్ల టన్నెల్ ఎందుకు తవ్వలేదు? గత పదేళ్లలోనే దీన్ని పూర్తి చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో అని మంత్రి తెలిపారు.