KTR: బీజేపీ అటెన్సన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోంది : కేటీఆర్
హైడ్రా గురించి గొప్పగా చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి దమ్ముంటే తన మంత్రులు అక్రమంగా కట్టుకున్న నిర్మాణాలను తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావునగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. 24 నెలల తన పాలన చూపించి ఓట్లు అడగాలన్నారు. పదేళ్ల కేసీఆర్ (KCR) పాలన, రెండేళ్ల దుర్మార్గ పాలన మీ కళ్ల ముందే ఉందని, ప్రజలు చూసి తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు అటెన్షన్ డైవర్సన్ చేసి సొత్తు దోచుకెళ్లే మాదిరి, ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగిందని విమర్శించారు. చిల్లర పంచాయితీలు పెట్టి రేవంత్ రెడ్డికి లాభం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని ప్రచారాలు, గిమ్మిక్కులు చేసినా గెలుపు మాగంటి సునీత, కేసీఆర్లదేనని స్పష్టం చేశారు.







