Kishan Reddy: ప్రజల మధ్యకు రాని కేసీఆర్ సీఎం ఎలా అవుతారు? : కిషన్ రెడ్డి
మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తూ కేటీఆర్ (KTR) పగటి కలలు కంటున్నారని, ప్రజల మధ్యకు రాని కేసీఆర్ సీఎం ఎలా అవుతారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కిషన్ రెడ్డి ఎర్రగడ్డ డివిజన్ (Erragadda Division) లో పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్‌లపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవాలనుకోవడంలో తప్పు లేదుగానీ పరిమితికి మించి విమర్శలు చేయడం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు హద్దే లేకుండా పోతోంది అని ఎద్దేవా చేశారు. పేరుకే జూబ్లీహిల్స్ అయినప్పటికీ రోడ్లన్నీ మురికికూపాలుగా మారాయని, ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని రెండూ పార్టీలనూ విమర్శించారు.






