టిఎస్ ఐ-పాస్ తో పుంజుకున్న రియల్ ఎస్టేట్ – జయేష్ రంజన్

రోజురోజుకు అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో సామాన్యులు అద్దెకు ఉండాలంటే ఖర్చుతో కూడుకున్న పనేనని, అలాంటి సమయంలో క్రెడాయ్.. సామాన్య ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన గహలను అందుబాటులోకి తీసుకువస్తున్నదని రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ అభినందించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరెక్కడా లేనివిధంగా టీఎస్ ఐ-పాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న సంశయం ఉండేది. కానీ దీని ద్వారా చాలా మందికి లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు. నగరంలో ప్రధానంగా రియల్ ఎస్టేట్, తదితర వాణిజ్య, వ్యాపారాలు పుంజుకుంటున్నాయి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా 8వేల అనుమతులను అందించగలిగామన్నారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ అభివద్ధికి క్రెడాయ్ ఎంతగానో కషి చేస్తున్నదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్మాణ రంగాభివృద్ధికి కావాల్సిన చర్యలన చేపట్టిందన్నారు. హైదరాబాద్ నగరం వాణిజ్య, వ్యాపారాలకు అనువైనప్రాంతం కావడంతో భవిష్యత్తులో ఇక్కడ పెరుగనున్న జనాభాను దష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇక పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ లక్ష డబుల్ బెడ్ రూంలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధం చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. క్రెడాయ్ సైతం అందుబాటు ధరల్లో గహాలు సామాన్యులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌కు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నదని వెల్లడించారు. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రదర్శనకు 15వేలకుపైగా సందర్శకులు విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి రామకష్ణరావు, మాదాపూర్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.