Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం

ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) కు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వర్సిటీ నుంచి వాహన అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ (Audit) శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో ఆమెకు నోటీసులు (Notices) ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. వాహన అద్దె (Vehicle rental) కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని, రెండ్రోజుల్లో ఆమెకు అధికారులు నోటీసులు (Notices) జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎంలో అదనపు కార్యదర్శి హోదాలో ఆమె 2016 నుంచి 2024 మార్చి మధ్య 90 నెలలకు వాహనం అద్దె కింద రూ.61 లక్షలు తీసుకున్నారు. స్మితా సభర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని వర్సిటీ వీసీ ధ్రువీకరించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.