Janasena: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన (Janasena) పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం అన్నారు. ఈ మేరకు కూకట్పల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేపీహెచ్బీలో సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్‌గౌడ్ (Shankar Goud0 హాజరై పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్‌కుమార్ (Premkumar), వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.






