Janasena : జనసేన పార్టీకి మరో శుభవార్త.. తెలంగాణలో

జనసేన పార్టీ(Janasena Party) కి ఈసీ(EC) మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీకి తెలంగాణ(Telangana)లోనూ గుర్తింపునివ్వడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని, దానికి అనుగుణంగా తెలంగాణలోనూ గుర్తించాలని, గాజుగ్లాసు (Glass) గుర్తు ఇవ్వాలని ఇటీవల ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ (Ashok Kumar) ఉత్తర్వులు ఇచ్చారు.