BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన (Janasena) మద్దతు ప్రకటించింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు (Ramachandra Rao) లతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ (Shankar Goud) హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడిరచారు. ఉప ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశముందని తెలిపారు.






