Sridharbabu అదే మాట గతంలో మేం చెప్తే … ఆ రెండు పార్టీలు హడావుడి

జై తెలంగాణ రాష్ట్ర ప్రజల నినాదమని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జై తెలంగాణ (Jai Telangana) నినాదంపై ఒకరు పేటెంట్ ఏమీ తీసుకోలేదన్నారు. ఇది ఓ పార్టీకి సంబంధించిన నినాదం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ (KCR)కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం (Kaleshwaram) పై వేసిన ఓ దర్యాప్తు కమిషన్. స్వతంత్ర దర్యాప్తు కమిషన్‌ను రాజకీయంగా విమర్శించండం ఏంటి? బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) కలిసి నడుస్తున్నాయని కవిత చెప్పారు. అదే మాట గతంలో మేం చెప్తే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు హడావుడి చేశారు. ఆ రెండు పార్టీల మధ్య బంధాన్ని కేసీఆర్ కుమార్తె స్వయంగా చెప్పారు. కవిత వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.