Telangana :10 సంస్థలతో ఒప్పందం.. తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్(Davos) వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం, వివిధ సంస్థలతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే 10 సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా ఎంవోయూ చేసుకున్నాయి. ఈ పది సంస్థల ద్వారా రాష్ట్రంలో రూ.1.32 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు మూడిరతలు పెరిగాయి.
పెట్టుబడులు చేసుకున్న సంస్థలు :
అమెజాన్ (Amazon) వెబ్ సర్వీసెస్ -రూ.60 వేల కోట్లు
మేఘా (Megha) ఇంజినీరింగ్ సంస్థ -రూ.15 వేల కోట్లు
హెచ్‌సీఎల్ సంస్థ – రూ.10 వేల కోట్లు
జేఎస్‌డబ్ల్యూ -రూ.800 కోట్లు
విప్రో – రూ.750 కోట్లు
రూ.500 కోట్లతో స్కైరూట్ ఏరోస్పేస్ తయారీ, పరీక్షా కేంద్రం
రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎంవోయూ
అమెరికా సంస్థ ఉర్స్ క్లస్టర్స్ రూ.5 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం
రూ.7 వేల కోట్ల పెట్టుబడికి మైత్రా గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది.