Gongadi Trisha : గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష (Gongadi Trisha) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిషను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఆమెకు రూ.కోటి నజరానా ప్రకటించారు. అండర్ 19 ప్రపంచకప్ టీమ్‌లో మరో సభ్యురాలు ధ్రుతి కేసరి(Dhruti Kesari), టీమ్ హెడ్‌కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. త్రిషను సత్కరించిన సీఎం భవిష్యత్‌లో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిష ఆదరగొట్టింది. టీమ్‌ఇండియా కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించింది.