Independence Day : తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అసెంబ్లీ ప్రాంగణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar), మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) జాతీయ పతాకావిష్కరణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలను గురించి వివరించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwala Vijayalakshmi) జాతీయ జెండా ఎగురవేశారు. వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎగురవేశారు. వివిధ జిల్లా కార్యాలయాల ఎదుట ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలు మువ్వన్నెల జెండాలతో మెరిసిపోయాయి.







