Davos: ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం’ లో భాగం అవుతాను : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఒక ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సతత హరితంగా మార్చే ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం ‘ (Trillion Tree Campaign)లో భాగమవుతానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ (1t.org) నిర్వాహకులు తెలంగాణ పెవిలీయన్ ను సందర్శించి, ముఖ్యమంత్రి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి ఈ మేరకు పర్యావరణ ప్రమాణాన్ని చేయించారు.
తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్గనైజేషన్ వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ ష్వాబ్ గారు, నిర్వాహకులు ఫ్లోరియన్ వెర్నాజ్ గారు తదితరులు పాల్గొన్నారు.