మోంట్ గోమేరీ కౌంటీతో హైసియా ఒప్పందం
అంకురాలు, ఆవిష్కరణల వ్యవస్థల అభివృద్ధి కోసం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), మేరీల్యాండ్‌కు చెందిన మోంట్గోమేరీ కౌంటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ ఈ ఒప్పందంలో కీలక భూమిక పోషించింది. రెండు దేశాల్లోని సంస్థలకు వ్యాపారాభివృద్ధిలో అందుబాటులో ఉన్న వనరులను మెరుగుపర్చేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. అంకురాలు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలతో పాటు ఇతర సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని ఈ భాగస్వామ్యం సులభతరం చేయనుంది. హైసియా ప్రెసిడెంట్ మనీషా సాబూ, సిగ్నిటీ చైర్మన్, ఎండీ సీవీ సుబ్రమణ్యం, మోంట్గోమేర కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఎల్రిచ్ తదితరుల సమక్షంలో రెండు సంస్థలూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.






