America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ వాజిద్ (Mohammed Wajid) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో నివసించే మహ్మద్ అజీజ్ జల మండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహ్మద్ వాజిద్ (28) 2021లో ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని చికాగో (Chicago)కు వెళ్లాడు. వాజిద్ తమ్ముడు మహ్మద్ మాజిద్ కూడా అక్కడే ఎంఎస్ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్ అనారోగ్యం బారిన పడటంతో మందులు తీసుకువచ్చేందుకు వాజిద్ కారులో బయటకు వెళ్లారు. ఆ సమయంలో కారును ట్రక్కు(Truck) ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.