Revanth Reddy లైఫ్‌సైన్సెస్ కంపెనీల కు రాజధానిగా హైదరాబాద్ : రేవంత్ రెడ్డి

లైఫ్‌సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ లిల్లీ (Lilly) ని గచ్చిబౌలిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా తయారైన ఔషధాలు, టీకాలు చాలా దేశాలకు ఎగమతి అవుతున్నాయని తెలిపారు. ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్ వ్యాలీ ఇక్కడ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని అన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకే ప్రత్యేకమైన జీనోమ్ వ్యాలీ (Genome Valley) ఉంది. మెడ్ టెక్నాలజీకి రాష్ట్రం ప్రత్యేకమైన హబ్‌గా ఎదుగుతోంది అని పేర్కొన్నారు.