ఆఫీస్ స్పేస్ విక్రయాల్లో బెంగళూరును మించిన హైదరాబాద్

రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం ఇప్పుడు ఆఫీస్ స్పేస్ లీజ్ విషయంలో కూడా ముందుకు దూసుకెళ్ళింది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో గత కొన్నేళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఐటీ సెక్టార్ ఇండియన్ క్యాపిటల్‌గా పేరు ఉన్న బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ ముందుకెళ్ళింది. జులై, ఆగస్టు, సెప్టెంబరులకు సంబంధించి మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తగా దాదాపు 1.3 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అయితే ప్రతీసారి ఆఫీస్ స్పేస్ విషయంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండేది. మిగిలిన ఐదు మెట్రో నగరాలు ఆ తర్వాతే అన్నట్టుగా పరిస్థితి ఉండేంది. అయితే ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం ఆఫీస్ స్పేస్ లీజుకి సంబంధించి హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 25 లక్షల చదరపు అడుగుల స్థలానికి సంబంధించిన లీజు అగ్రిమెంట్లు పూర్తి అయ్యాయి. అంతకు ముందు ఏప్రిల్, మే, జూన్‌తో పోల్చితే ఈసారి అగ్రిమెంట్లు వేగంగా పూర్తి కావడంతో హైదరాబాద్ ముందుకు దూసుకుపోయింది.
మూడో త్రైమాసికానికి సంబంధించి ఆఫీసు లీజు విషయంలో 29 శాతం వాటాతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా 25 శాతం వాటాతో పూనే రెండో స్థానంలో నిలిచింది.